ఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా ఎలక్త్రిక్ బైక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని మెయింటైన్ చేయలేక కొంతమంది ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అందుచేతనే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తమిళనాడు ప్రాంతంలో కోయంబత్తూరులో ఉండేటువంటి బూమ్ మోటార్స్ అనే కంపెనీ నుంచి ద్విచక్ర వాహనాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇక దీనికి ఈ పేరును నామకరణంగా మాత్రమే పెట్టినట్లు సమాచారం. ఈ బైక్ లు విడుదల కాకముందే ఏకంగా..36,000 లకు పైగా బుకింగ్ లతో ముందు వరుసలో ఉంది. ఇక ఈ బైకు ను ఈ నెల నుంచే కస్టమర్లకు అందించనుంది. ఈ బైక్ చూడడానికి చాలా సింపుల్ డిజైన్ తో ఉండడం వల్ల కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది.. ఈ బైక్ ట్రెండ్ వేరియంట్లలో లభిస్తుంది.. ఈ బైక్ 2.3 kwh సామర్థ్యం గల బ్యాటరీతో లభించును. ఇది ఫుల్ ఛార్జింగ్ కావాలంటే..2 నుంచి నాలుగు గంటల సమయం పడుతుందట. ఇలా ఒకసారి చేసుకుంటే 200 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేయవచ్చు. ఇక ఇందులోనే..3kwh కెపాసిటీ గల మోటార్ తో 65 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో వెళ్ళగలదు. ఇక ఈ ఇంజన్ కెపాసిటీ బట్టి స్పీడ్ చెప్పవచ్చు. ఈ బైక్ ను హై టెన్సైల్ స్టీల్ తో ఈ బైక్ బాడీ తయారు చేయబడింది. బ్యాటరీని ఎక్కువగా అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయం కూడా కలదు. అంతేకాకుండా ఇది మన ఇళ్లల్లో దొరికేటటువంటి ఛార్జింగ్ పోర్టు ద్వారా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక దీనిని కొన్ని ప్రధాన నగరాలలో.. దాదాపుగా అరవై డీలర్ల కేంద్రంలలో మనకు లభిస్తుంది. ఇక ఈ బైక్.. ధర విషయానికి వస్తే..90,000 నుంచి 1.24,999 వరకు లభిస్తుంది. ఒకవేళ ఈఎంఐ పద్ధతిలో అయితే..5 సంవత్సరాల వరకు మనం కట్టుకోవచ్చు. ఈ విషయాలన్నిటినీ సంస్థ సీఈవో నారాయణ తెలియజేశారు.
0 Comments