Ad Code

వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ !


ప్రముఖ క్యాబ్​ సేవల సంస్థ ఉబెర్ భారతదేశంలో ఓ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఉబెర్ యాప్  అవసరం లేకుండానే వాట్సాప్​ద్వారా క్యాబ్​ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇకపై వినియోగదారులు ఉబెర్​ చాట్ బోట్​తో కనెక్ట్ అయ్యి సులభంగా క్యాబ్​ బుక్​ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం ఇన్​స్టన్ట్​ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​తో ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్​ కంపెనీ పేర్కొంది. ఇలాంటి ఫీచర్​ ప్రపంచంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అది కూడా భారత్​లోనదీన్ని తొలిసారి ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది. రైడర్లు ఇకపై ఉబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే వాట్సాప్​ ద్వారా రిజిస్ట్రేషన్​ దగ్గరి నుంచి క్యాబ్ బుకింగ్​, ట్రిప్​ రిసిప్ట్​ పొందడం​ దాకా అన్ని సేవలు పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఈ సేవలను పైలెట్​ ప్రాజెక్టుగా, ఉత్తరప్రదేశ్​ రాజధాని లక్నో లోనే అమలు చేయనున్నారు. త్వరలోనే మిగతా నగరాలకూ దీన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్​లోనే సేవలు అందుబాటులో ఉన్నా.. రానున్న రోజుల్లో మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మెటా(ఫేస్​బుక్​) యాజమాన్యంలోని వాట్సాప్​ భారతదేశంలో అర బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లను కలిగి ఉంది. దీంతో వాట్సాప్​తో ఉబెర్​ టై అప్​ కావడం ఆ కంపెనీకే కాకుండా కస్టమర్లకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

Post a Comment

0 Comments

Close Menu