కరోనా కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం కాబట్టి.. చాలామంది పండ్లపై దృష్టి సారిస్తున్నారు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా రోజుకో పండు తినాలని సూచిస్తుంటారు. శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని కాంబినేషన్ పండ్లు మాత్రం అస్సలు తినకూడదని.. అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.
* బొప్పాయి-నిమ్మ: ఈ రెండు పండ్లను కలిపి తింటే రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్చుతగ్గుల సమస్యలు తలెత్తుతాయి. అలాగే రక్తహీనత కూడా రావొచ్చునని వైద్యులు అంటున్నారు. * ఆరెంజ్-క్యారెట్: ఆరెంజ్, క్యారెట్‌ను కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రెండు పండ్లను కలిపి తింటే కిడ్నీ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. * జామ-అరటిపండు: జామ-అరటిపండును కలిపి తినడం వల్ల గ్యాస్ సమస్యలు, అలాగే తలనొప్పి పెరిగే అవకాశం * దానిమ్మ-నేరేడు: ఈ రెండు పండ్లలో చక్కెర, ప్రోటీన్ శాతాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
0 Comments