🍁ఏక బిల్వం శివార్పణం

  


పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.  ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది.  ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు.  ఇలాగ ఈ మూడింటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము. ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికీ, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారేడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయనే సర్వాంతర్యామి! బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్ తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయంటారు.  అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది. పూజకుడవు నీవే, పూజింబడేది నీవే - అనే భావంతో శివుని పూజించుటయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్ర రూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది. పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి. బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి. ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది. ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి. బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణలో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి! తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.

పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు! ఈశ్వరుడు 'జగతీనాంపతిః'. అందుచే మనమందరమూ ఆయన సేవకులం. మన ఆజ్ఞానం తొలగించి సద్గురువై జ్ఞానదానం చేసేదీ ఆయనే. భక్తితో ఆయనకు ఒక్క బిల్వదళం అర్పిస్తే చాలు. ఆ ఆశుతోషుడు సంతోషించి తన కరుణా పూరితాపాంగవీక్షణం మనపై ప్రసరింపజేస్తాడు. మనకు ఐహిక సంపదయేకాక ఆముష్మికసంతోషం కూడా ఇస్తాడు. ఈ విషయమే ఈ క్రింది శ్లోకంలో ఉన్నది. 

''త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుషమ్, 

త్రిజన్మ పాపసంహార మేకబిల్వం శివార్పణము||'' 

బిల్వం అతిపవిత్రమైనది. ఇది మూడుదళాల కూడిక. శివునికి మూడు కన్నులున్నట్టు బిల్వానికి మూడు దళాలు ఉంటవి. అది లక్ష్మికి వాసస్థానం. అందుచేతనే లక్ష్మీ అష్టోత్తరంలో 'బిల్వనిలయాయై నమః' అన్న ఒక నామం ఉన్నది. శ్రీ సూక్తమున్నూ- 

''ఆదిత్యవర్ణే తపసోధిజాతో 

వనస్పతి స్తవవృక్షోథ బిల్వః' 

తస్యఫలాని తపసానుదన్తి మాయా 

అన్తరాయాశ్చ బాహ్యాఅలక్ష్మీః||'' 

అనిచెప్పుతున్నది. బిల్వదళోపరిభాగాలలో (వెనుకవైపు) శ్రీలక్ష్మీదేవి ఉన్నట్టు మన నమ్మిక. అందుచేతనే లింగానికి బిల్వపు వెనుకభాగం తగిలేటట్టు మనం అర్చిస్తాము.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains