మైదా తయారీ గురించి తెలుసుకుని ఉంటే కచ్చితంగా దాన్ని వాడడం మానేస్తారు. మైదాపిండి వినియోగం మనదేశంలో ఎక్కువే. రవ్వదోశ, కేకులు, పరోటా, జిలేబీలు, వివిధ రకాల స్వీట్లు, కొన్ని రకాల బ్రెడ్‌లు... ఇలా ఎన్నో ఆహారపదార్థాలు మైదాతోనే చేస్తారు. మనం తినే ఆహారంలో సగం మైదాతోనే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతగా ఆ పిండి మన ఆహారంలో భాగమైపోయింది. మైదాతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదా తయారీకి ముడి పదార్థం గోధుమలు. గోధుమ పిండి మంచిదే అయినప్పుడు మైదా ఎందుకు మంచిది కాదు అనే సందేహం రావచ్చు. ఏదైనా ఒక ఆహారపదార్థం విలువ అది తయారుచేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. గోధుమలను కేవలం పిండి ఆడించడం ద్వారా మాత్రమే గోధుమ పిండి తయారవుతుంది. కానీ మైదా అలా కాదు దీని తయారీకి  పెద్ద తతంగమే ఉంది. గోధుమలను అతిగా పాలిష్ చేస్తారు. పై పొరలన్నీ పాలిష్ రూపంలో పోయిన తరువాత లోపల మిగిలిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి పసుపు రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా, చాలా మృదువుగా చేసేందుకు కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. క్లోరైడ్ గ్యాస్, బైంజాయిల్ పెరాక్సైడ్, అజోడి కార్బోనమైడ్ వంటి రసాయనాలను కలిపి పిండిని తెల్లగా మారుస్తారు. చివరలో పొటాషియం బ్రోమేట్ ను కూడా అదనంగా జోడిస్తారు. ఇది చాలా శక్తివంతమైన ఆక్సిడైజర్. మైదాపిండిలో వాడే ప్రధాన రసాయనమైన బెంజాయిల్ పెరాక్సైడ్ వాడాకాన్ని చాలా దేశాల్లో నిషేధించారు. దాని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. అలాగే పొటాషియం బ్రోమేట్న్ ను నిషేధించారు. మైదాలో 'అల్లోక్సాన్' అని పిలిచే విషపూరితమైన రసాయనం ఉంటుంది. మైదాపిండిని నిత్యం వాడేవారికి ఆరోగ్యసమస్యలు తప్పవని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. 


Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ