Ad Code

వరల్డ్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌గా రిలయన్స్‌


రిలయన్స్ ఇండస్ట్రీస్ కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. దేశంలోనే అత్యుత్తమ ఎంప్లాయర్ కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. ఈ మేరకు బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్-2021 నివేదికను వెల్లడించింది. ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్యాల జాబితను విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు భారతదేశంలోని 19 కంపెనీలకు చోటు లభించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ అత్యుత్తమ యాజమాన్యాల జాబితాలో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచ స్థాయిలో 52 వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 750 పెద్ద కంపెనీలను ఈ జాబితాలో చేర్చారు. భారతదేశం నుంచి మొత్తం 19 కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది. టాప్ 100 కంపెనీల్లో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీలలో ఐసీఐసీఐ బ్యాంక్ 65 వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 77, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 90 వ స్థానంలో నిలిచాయి. అలాగే, ఎస్‌బీఐకి 119, లార్సన్‌ అండ్‌ టుర్బో 127, బజాజ్‌ 215, యాక్సిస్‌ బ్యాంక్‌ 254, ఇండియన్‌ బ్యాంక్‌ 314, అయిల్‌ అండ్ నేచురల్‌ గ్యాస్‌ 404, అమర్‌రాజా 405, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 418, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 496, ఎల్‌ఐసీ 504, ఇన్ఫోసిస్‌ 588, టాటా గ్రూప్‌ 746 స్థానాల్లో నిలిచినట్లు ఫోర్బ్స్‌ సంస్థ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu