కరోనా కంటే సెమికండక్టర్లు ఆటో మొబైల్ పరిశ్రమను ఎక్కువ ఇబ్బందులకు గురి చేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మార్కెట్ పుంజుకుంటుంది అనుకునే తరుణంలో ఈ చిప్‌సెట్ల కొరత వచ్చి పడింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ కార్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల కిందట కియా ఇండియా మార్కెట్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్ల అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తోంది. సెప్టెంబరులో మిగిలిన ఆటోమొబైల్ కంపెనీ కార్ల అమ్మకాల్లో తగ్గుదల ఉండగా కియా విషయంలో అది జరగలేదు. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే కియా కార్ల అమ్మకాలు 1.4 శాతం పెరిగాయి. సెప్టెంబరులో కియా సంస్థ నుంచి 14,441 యూనిట్ల కార్ల అమ్మకాలు జరిగాయి. కియా కార్ల అమ్మకాల్లో మేజర్ షేర్ సెల్టోస్‌దే. మిడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సెల్టోస్‌కి ఎదురు లేకుండా పోతుంది. 2019 ఆగస్టులో ఈ మోడల్ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది కియా. సెప్టెంబరు అమ్మకాలకు సంబంధించి ఈ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న హ్యుందాయ్ క్రెటాను అధిగమించింది. సెప్టెంబరులో 9,583 సెల్టోస్ వాహనాలు అమ్ముడయ్యాయి. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సోనెట్ సైతం మంచి ఫలితాలు కనబరిచినట్టు కియా తెలిపింది. సెప్టెంబరు నెలలో సోనెట్ అమ్మకాలు లక్ష మార్క్‌ను క్రాస్ చేసినట్టు వివరించింది. సెప్టెంబరులో 4,454 సోనెట్ కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్‌లో కియా నుంచి ప్రీమియం వెహికల్‌గా కార్నివాల్ ఉంది. ఈ కారు అమ్మకాలు బాగుంటంతో తాజాగా ఈ వెర్షన్‌లో అప్‌డేట్ చేసింది కియా. ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసైన్, లిమోసైన్ ప్లస్ వేరియంట్లలో కార్నివాల్‌ను అందిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో 3.30 లక్షల కార్లు అమ్ముడైనట్టు కియా తెలిపింది.
0 Comments