Ad Code

ఉచిత వైఫై తీసుకుంటున్నారా?


ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు సర్ఫింగ్‌ చేసేందుకు వీలుగా ఇంటర్నెట్ కనెక్షన్‌ కూడా తీసుకుంటున్నారు. డాటా అయిపోగానే ఇతరుల డాటాను వాడుకోవడంపై దృష్టిపెడుతున్నారు. ఈ ఉచిత వైఫై మన మొబైల్ ప్రైవసీని ఉల్లంఘింస్తుందన్న విషయం మాత్రం మనం తెలుసుకోవట్లేదు. వైఫైకి కనెక్ట్ అవగానే మొబైల్ డాటా వైఫై సర్వర్‌లో నిల్వ అవుతుంది. సైబర్ నేరస్థుడు ఇదే నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి.. సర్వర్‌ను హ్యాక్ చేసి మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్రీ వైఫై ట్రెండ్‌లో ఉంది. రైల్వే, బస్సులు, హోటళ్లు, మాల్స్‌, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద ఉచిత వైఫై సౌకర్యం అందిస్తున్నారు. అక్కడి నెట్‌వర్క్‌కు చేరుకుని ఉచితంగా ఇంటర్నెట్‌ ప్రయోజనాన్ని పొందుతున్నారు. అయితే, వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన వెంటనే వారి మొబైల్ డాటా మొత్తం వైఫై సర్వర్‌కు చేరుతుందన్న విషయం ప్రజలకు తెలియదు. దీని కారణంగా డాటా లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఉచిత వైఫై కొన్నిసార్లు లాస్ డీల్ అని నిరూపించవచ్చునంటున్నారు సైబర్‌ నిపుణుడు. ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లో చేరగానే మన మొబైల్‌లో సైనప్ సెట్టింగ్ సందేశం అందుతుంది. యెస్‌ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మొబైల్ డాటా ఆటోమేటిక్‌గా సర్వర్‌కు కాపీ అవుతుంది. ఉచిత వైఫై కనెక్షన్ పొందిన తర్వాత, మొబైల్‌లో సైనప్ మెసేజ్ వస్తుంది. దీనిలో అవును అనే ఆప్షన్‌ బటన్‌పై క్లిక్ చేయగానే సర్వర్ మన మొబైల్ లొకేషన్, ఫొటో గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్ లిస్ట్, వీడియో గ్యాలరీ గురించి కూడా అడుగుతుంది. ఆ అన్ని ఆప్షన్‌లపై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మొబైల్ ఉచిత వైఫైకి కనెక్ట్ అవుతుంది. ఇలా జరిగేలోపే మన మొబైల్‌లోని డాటా మొత్తం వైఫై సర్వర్‌లో కాపీ అవుతుంది. దీని నుంచి బయటపడేందుకు ఉచిత వైఫైని తీసుకోకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో విశ్వసనీయ ప్రదేశాల నుంచిగానీ, వ్యక్తుల నుంచి గానీ అందుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu