2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ''పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతులిచ్చాం" అని సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
0 Comments