Ad Code

ఆ ప్లేట్ ఖరీదు 13 కోట్లు !

 

స్కాట్లాండ్‌లో ఒక పురాతన ప్లేట్ 1.7 మిలియన్ల యూఎస్ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.  బ్రిటిష్ వేలం పాటదారు లియోన్ & టర్న్‌బుల్ స్కాటిష్ సరిహద్దులోని లోవుడ్ హౌస్‌లో సంస్థ యూరోపియన్ సెరామిక్స్ నిపుణులు కొన్ని పాట వస్తువులు వేలం కోసం అందుబాటులోకి తెస్తున్నారని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. వారికి అక్కడ ఓ డ్రాయర్ నుండి 16 వ శతాబ్దపు ప్లేటును కనుగొన్నాడు. చాలా పురాతనమైన ప్రత్యేకత ఉన్న ప్లేటు కావడంతో సదరు సంస్థ వేలం వేసింది. అక్కడ వేలం వేసిన లోవుడ్ హౌస్‌లో దొరికిన 400 వస్తువులలో ప్లేట్ ఒకటి. కానీ ప్రజలు ఈ ప్లేట్ కోసం ఇంత ఆసక్తి చూపిస్తారని ఎవరూ అనుకోలేదు. అయితే, అనూహ్యంగా ఆ ప్లేట్ రికార్డ్ ధరకు అమ్ముడు పోవడం వేలం వేసిన సంస్థ వారినే ఆశ్చర్యపరిచింది. ఈ ప్లేటు 27 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంది. దీనిపై శామ్సన్.. డెలీలా బైబిల్ కథలోని దృశ్యాన్ని అందంగా చెక్కారు. ఈ ప్లేటు 500 సంవత్సరాల కాలం నాటిది. దీనిని కుమ్మరి అదేవిధంగా కళాకారుడు నికోలాడ ఉర్బినో 1520-23లో తయారు చేశారు. ఇటాలియన్ మట్టితో చేసిన ఈ ప్లేట్‌ను మైయోలికా అంటారు. ఈ మైయోలికా మొదట్లో 1 లక్ష 9 వేల నుండి 1 లక్ష 63 డాలర్ల మధ్య ధర పలుకుతుందని భావించారు. అయితే దీని ధర ఊహించిన దాని కంటే చాలా రెట్లు ఎక్కువ పలికింది. దీనిని వేలం వేసినప్పుడు, ప్రజలు రికార్డు స్థాయిలో 1,721,000 యు ఎస్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ .12,96,01,626) బిడ్ చేసారు. విశేషంగా, ఈ బిడ్ దాని అసలు అంచనా కంటే 10 రెట్లు ఎక్కువ. లియాన్ & టర్న్‌బుల్ మేనేజింగ్ డైరెక్టర్ గావిన్ స్ట్రేంజ్ మాట్లాడుతూ, ఈ ప్లేట్‌కి ఇంత బిడ్ వస్తుందని మాకు తెలియదు. దీనికి అంత ఖరీదు పలకడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu