Ad Code

గూగుల్ యాప్స్ పనిచేయవు

 

సెప్టెంబర్ నెలలో గూగుల్ కొత్త అప్డేట్ ను విడుదల చేయనుంది. ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్ మరియు అంతకంటే పైన ఉండే వెర్షన్స్ తో మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి, 2.3.7 మరియు అంతకన్నా తక్కువ వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ యాప్స్ పనిచేయడం మానేస్తాయి. దీనికి కారణం 2.3.7 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు మద్దతును నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించడమే. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సర్వీస్ ఉపయోగించడానికి 3.0 అంతకన్నా పైన వెర్షన్ ను కలిగివుండాలని గూగుల్ తెలిపింది. అంటే కొత్త నిబంధనల ప్రకారం, 3.0 కన్నా తక్కువ వెర్షన్ ఉపయోగించేవారు యూట్యూబ్, జిమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్ తో సహా మరికొన్ని గూగుల్ సర్వీస్ లను ఉపయోగించలేరు. అంటే, గూగుల్ హనీ కాంబ్ వెర్షన్ ను వినియోగదారులు వారి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కలిగి ఉండాలి.

ఇప్పటికే గూగుల్ అటువంటి వెర్షన్ వాడేవారికి మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది మరియు సెప్టెంబర్ 2 తరువాత ఆ వెర్షన్ కలిగిన వారు వారి జిమెయిల్, యూట్యూబ్ మరియు మరికొన్ని గూగుల్ యాప్స్ కి లాగిన అవ్వలేరు. అటువంటి వారు వారి ఫోన్లను రీసెట్ చేసిన లేదా కొత్త అకౌంట్ తో లాగిన్ చేయాలని చూసినా 'యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎర్రర్' ని మాత్రమే చూస్తారు. యాప్స్ ద్వారా మీరు లాగిన్ చెయ్యలేక పోయినా, వెబ్ బ్రౌజరు నుండి లాగిన్ చేయ్యుడానికి వీలుంటుంది. బ్రౌజర్ నుండి ఏదైనా గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా వాటిని ఉపయోగించవచ్చు. మీరు వెబ్ బ్రౌజర్ నుండి ఎంచుకున్న కొన్ని గూగుల్ సేవలను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu