Ad Code

ఆప్రికాట్ తింటే ఆరోగ్యానికి మంచిది !

 

మనం తీసుకునే ఆహారం మన యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా మనం పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్ మొదలైన వాటిని మన డైట్లో నుండి కట్ చేసి పండ్లు, కూరగాయలు మొదలైనవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే ఆప్రికాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆప్రికాట్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్స్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ మొదలైనవి ఉంటాయి. 

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది

ఆప్రికాట్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి వాటి నుండి ఇది రక్షిస్తుంది.

జీర్ణ సమస్యలు ఉండవు

ఆప్రికాట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.

హైబీపీని కంట్రోల్ చేస్తుంది

హైబీపీ తో బాధపడే వాళ్లు రెగ్యులర్ గా డైట్ లో ఆప్రికాట్ ను తీసుకుంటే మంచిది. దీనిని తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య తగ్గుతుంది. కాబట్టి హైబీపీ తో బాధపడే వాళ్ళు వీటిని తీసుకుంటే మంచిది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఆప్రికాట్ డైట్ లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అదే విధంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కరొనరి ఆర్టెరీ సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఎనీమియా సమస్య ఉండదు

ఆప్రికాట్ తినడం వల్ల ఎనిమియా సమస్య ఉండదు. అలానే నీరసం, శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా బయటపడొచ్చు. ఆప్రికాట్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కనుక దీనిని తీసుకుంటే ఎనీమియా సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu