చెన్నైకి చెందిన రంగనాథన్ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టికెటింగ్ పోర్టల్‌లో బగ్‌ను కనిపెట్టడంతో ఆ సంస్థ వెంటనే సరిదిద్దింది. హ్యాకర్ల చేతికి ఈ సమాచారం చిక్కితే దుర్వినియోగమయ్యే అవకాశం ఉండటంతో వెంటనే ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేయడంతో వారు ఆ బగ్‌ను సరిచేశారు. చెన్నైలోని తాంబరంలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి పి.రంగనాథన్ కొన్ని రోజుల క్రితం ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ అయ్యి టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే వెబ్‌సైట్‌లో భద్రత పరమైన సమస్యలు ఉన్నాయని విద్యార్థి గుర్తించాడు. ప్రయాణికులకు సంబంధించిన పేరు, వయసు, రైలు ప్రయాణం వివరాలు, పీఏన్‌ఆర్ నంబర్, గమ్యస్థానం మొదలైనవి రంగనాథన్ తెలుసుకున్నాడు. ప్రయాణికులకు తెలియకుండానే వారి టిక్కెట్టును ఒక హ్యాకర్ రద్దు చేయగలడని గుర్తించాడు. దీంతో ఆ టీనేజర్ ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేయడంతో వారు ఆ బగ్‌ను సరిదిద్దారు. ప్రయాణికులకు తెలియకుండానే హ్యాకర్ వారి పేరు మీద ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవచ్చు. టిక్కెట్టును కూడా రద్దు చేయవచ్చు. బస్ టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లను కూడా మార్చవచ్చు అని అతడు ఒక మీడియాకు తెలిపాడు. గత ఆగస్టు 30న పోర్టల్‌లో ఉన్న బగ్‌ల గురించి ది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీమ్(సెర్ట్)కు సమాచారం అందించాడు. వారు వెంటనే ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేశారు. ఐఆర్‌సీటీసీ అధికారులు ఐదు రోజుల అనంతరం ఈ బగ్‌ను సరిదిద్దారు.
0 Comments