Ad Code

గెలాక్సీ ఎం52 5జీ 28న విడుదల



సామ్‌సంగ్ ఫోన్లకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. అందుకే.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సామ్‌సంగ్ ఇండియా మార్కెట్‌లో స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. గత సంవత్సరం సామ్‌సంగ్ గెలాక్సీ 51 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి అప్‌గ్రేడ్ వర్షన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్‌ను ఇండియాలో సెప్టెంబర్ 28న సామ్‌సంగ్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 19న రిలీజ్ చేయాలని భావించినా.. ఆరోజు రిలీజ్ చేయలేదు. సెప్టెంబర్ 28న సామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నామని సామ్‌సంగ్ ట్విట్టర్‌లో తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల గురించి ఎక్కువగా సామ్‌సంగ్ రివీల్ చేయకున్నప్పటికీ.. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్ ఫీచర్లు మాత్రం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ధర సుమారుగా రూ.32,900 ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌, హోల్ పంచ్ డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. 7.4 ఎంఎం స్లిమ్ బిల్డ్ థిక్‌నెస్ మాత్రమే ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ, ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌, ఆక్టా కోర్ క్వాల్కామ్ ఎస్ఎమ్‌7325 స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 64 ఎంపీ రేర్‌ కెమెరా సెన్సార్‌, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5జీతో పాటు 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్‌, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.

Post a Comment

0 Comments

Close Menu