దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్బ్రాండ్ శాంసంగ్ తన యూజర్లకు షాకిచ్చింది. శామ్‌సంగ్ మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ భారత మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ A52s 5 జి వేరియంట్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. అయితే, శామ్‌సంగ్ తాజాగా తన గెలాక్సీ A52 4 జి వేరియంట్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్ ధరను భారత మార్కెట్లో రూ .1,000 పెంచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చిలో విడుదలవ్వగా కొద్ది నెలల్లోనే రూ. 1000 ధర పెరగడం గమనార్హం. శామ్‌సంగ్ గెలాక్సీ A52 4 జి మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరనూ కంపెనీ ఇప్పడు పెంచేసింది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇప్పటివరకు రూ .26,499 వద్ద లభిస్తుండగా.. ఇకపై రూ .27,499 ధర వద్ద లభించనుంది. మరోవైపు, 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇప్పటివరకు రూ .27,999 వద్ద లభిస్తుండగా.. దీని ధరను రూ .28,999 కు పెంచేసింది. ప్రస్తుతం అమెజాన్, శామ్‌సంగ్ వెబ్సైట్లలో వీటిని కొత్త ధరలతోనే అమ్మకానికి పెట్టింది. శామ్‌సంగ్ గెలాక్సీ A52 5G ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB ర్యామ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండింటిలోనూ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించింది. మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో ఈ స్టోరేజ్‌ని మరింతగా విస్తరించవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 52 ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 -అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, IP67 రేటింగ్ కలిగి ఉంటుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. 64MP మెయిన్ సెన్సార్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP బొకే సెన్సార్, 5MP మాక్రో సెన్సార్‌తో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌ని అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32MP ఫ్రంట్ సెన్సార్ కెమెరాను చేర్చింది. ఇది 2500 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4500mAh బ్యాటరీతో వస్తుంది. శామ్‌సంగ్ భాటలోనే ఇతర స్మార్ట్‌ఫోన్ సంస్థలు కూడా నడుస్తున్నాయి. షియోమి ఇటీవల తన రెడ్‌మి సిరీస్‌లోని ఆరు బేస్ వేరియంట్ల ధరలను పెంచేసింది.
0 Comments