ఒప్పో ఈరోజు మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ 16ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో అందించింది. ఒప్పో ఏ16 స్మార్ట్ ఫోన్ సరికొత్త 'Eye Care Display', హెవీ 5,000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఒప్పో స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB సింగిల్ వేరియంట్ రూ. 13,990 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 20 నుండి Amazon మరియు మైన్ లైన్ రిటైల్ అవుట్ లెట్స్ నుండి లభిస్తుంది. ఒప్పో ఏ16 ఫోన్ 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ Eye Care డిస్ప్లేని కలిగివుంది. ఇది 88.7 స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు 1600 x 720 రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Helio G35 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ Android 11 ఆధారితంగా ColorOS 11.1 స్కిన్ పైన పనిచేస్తుంది. మెమోరిని పెంచడానికి మైక్రో SD కార్డు అప్షన్ ని కూడా అందించింది మరియు 256GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక AI ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 13MP మైన్ కెమెరా మరియు జతగా 2ఎంపి బొకే కెమెరా మరియు 2ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ కేమెరా సిస్టం మంచి డెప్త్ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు మరియు స్మార్ట్ బ్యాటరీ ప్రొటక్షన్ ఫీచర్ తో జతకలిసిన 5,000 mAh బిగ్ బ్యాటరీ మరియు రిటైల్ బాక్స్ లో ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుతుంది. ఈ ఫోన్ క్రిస్టల్ బ్లాక్ మరియు పెర్ల్ బ్లూ అనే రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది.
0 Comments