ప్రపంచంలోనే నెంబర్ వన్ సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డౌన్‌లోడ్స్ అయిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు టాప్‌లో ఉన్న పేస్‌బుక్‌ను కిందికి నెట్టేసి.. టిక్‌టాక్ మొదటిస్థానంలో నిలిచింది. ఒక బిజినెస్ జర్నల్.. సోషల్ మీడియా యాప్స్ డౌన్‌లోడ్స్ మీద చేపట్టిన గ్లోబల్ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా టిక్‌టాక్ గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. ఇండియాలో గత సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సుమారు చైనాకు చెందిన సుమారు 200 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. అందులో టిక్‌టాక్ కూడా ఉంది.
0 Comments