యాహూ న్యూస్ ఇది తెలియని వారుండరు. మనలో ఎంతో మందికి ఇంటర్నెట్ పరిచయం అవ్వగానే మొదట తెలిసేంది యాహూనే అని కచ్చితంగా చెప్పవచ్చు. 2017లో అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ యాహూను కొనుగోలు చేసింది. అలాంటి యాహూ సంస్థ తన న్యూస్ కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. యాహూ అనేది అమెరికాకు చెందిన సంస్థ. దాదాపుగా 20 ఏళ్లుగా న్యూస్ ఆపరేషన్‌లను నిర్వహిస్తోంది. ఆగస్టు 26 నుంచి యాహూ ఇండియా న్యూస్ ఆపరేషన్‌లను నిలిపివేసింది. దీనిపై అధికారిక ప్రకటనను వెల్లడించిది. ఇక మీద యాహూ కొత్త వార్తలను అందించదని స్పష్టం చేసింది. న్యూస్ ఆపరేషన్ నిలిపివేత.. ఇతర విభాగాలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
కొత్త చట్టాలే కారణం
ఈ విషయాన్ని యాహూ ఇండియా తమ హోం పేజీలో అధికారికంగా పేర్కొంది. ఇకపై యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, పలు అంశాలకు సంబంధించి కంటెంట్ అందుబాటులో ఉండదు. భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మీడియా నియంత్రణ చట్టాల ప్రభావం, ఎఫ్‌డీఏ కొత్త నిబంధనల కారణంగా యాహూ న్యూస్ నిలిపి వేస్తున్నట్టు యూహూ స్పష్టం చేసింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం 26శాతం మాత్రమే విదేశీ పెట్టుబడులు ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి ఈ నిబంధన అమలు కానుండడంతో యాహూ ఇండియా ఈ నిర్ణయం తీసుకొంది. యూజర్లు వినియోగిస్తున్న యాహూ అకౌంట్‌లతో పాటు.. ఈ మెయిల్, యాహూ సెర్చ్ ఆప్షన్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహూ పేర్కొంది. ముఖ్యంగా ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాహూ క్రికెట్‌పై ఈ ప్రభావం ఉండనుంది.
0 Comments