రెడ్‌మీ నోట్ 10 ధరను షియోమీ కంపెనీ అమాంతం పెంచేసింది. షియోమీ పెంచిన మరుసటిరోజే.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ కూడా ధరలలో మార్పు తీసుకొచ్చి… రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ సీ11, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25ఎస్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ 5 స్మార్ట్‌ఫోన్ల ధరలను భారత్‌లో అదనంగా రూ.1500 వరకు పెంచుతున్నట్టు రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ సీ11(2021) ఫోన్ ధర రూ.300, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25ఎస్ ధర రూ.5వేల వరకూ పెంచింది. రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ ధర రూ.1500 వరకూ పెంచింది. పెరిగిన ధరలు.. ఈ- కామర్స్ సైట్లతో పాటు రియల్‌మీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో కూడా అమల్లోకి వచ్చాయి. రియల్‌మీ 8 (4 జీబీ ప్లస్ 128 జీబీ) బేసిక్ మోడల్ ప్రస్తుత ధర.. రూ.15వేల 999గా ఉంది. ధర పెరగకముందు.. రియల్‌మీ 8 ధర.. రూ.14వేల 499గా ఉండేది. 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.16వేల 999గా ఉంది. ఇంతకుముందు.. దాని ధర రూ.16వేల 499గా మాత్రమే ఉండేది. రూ.15వేల 499గా ఉన్న రియల్‌మీ 8 5జీ ధర పెరగకముందు.. రూ.13వేల 999గా ఉండేది. 6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16వేల 499 కాగా.. గతంలో దీని ధర రూ.14వేల 999గా ఉండేది. టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ మోడల్ ధర.. రూ.16వేల 999 నుంచి రూ.18వేల 499 వరకూ పెరిగింది.
0 Comments