Ad Code

అంబ్రిలో రిలయన్స్ పెట్టుబడి

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ “అంబ్రి”లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. తద్వారా అంబ్రి సంస్థలో..రిలయన్స్ ఎనర్జీ మొత్తం 42.3 మిలియన్ షేర్లు ప్రిఫరెన్షియల్ పద్దతిలో తీసుకుంటుంది. రిలయన్స్ తో పాటు ఇతర స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు అయిన పాల్సన్ అండ్ కో, బిల్ గేట్స్ కలిపి మొత్తం 144 మిలియన్ డాలర్లు అంబ్రి కంపెనీలో పెట్టుబడి పెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజి వ్యాపారం విస్తరించడానికి ఈ డీల్ ఎంతో దోహదపడుతుందని రిలయన్స్ భావిస్తోంది. ఈ పెట్టుబడి.. కంపెనీ తన దీర్ఘకాలిక శక్తి నిల్వ వ్యవస్థలను వాణిజ్యీకరించడానికి మరియు పెరగడానికి సహాయపడుతుందని భావిస్తోంది. అంతేకాకుండా అంబ్రి సహకారంతో ఇండియాలో అతిపెద్ద బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ రెడీ అవుతోంది. ఈ ఏడాది జూన్‌లో వాటాదారులను ఉద్దేశించి రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. విద్యుత్ శక్తి నిల్వ కోసం జామ్‌నగర్‌లో గిగా ఫ్యాక్టరీని నిర్మించాలనుకుంటున్న ప్రకటించారు. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉపయోగించగల కొత్త మరియు అధునాతన ఎలక్ట్రో-కెమికల్ టెక్నాలజీలను అన్వేషిస్తున్నామన్నారు. సృష్టించే శక్తిని నిల్వ చేయడానికి పెద్ద స్థాయి గ్రిడ్ బ్యాటరీలను ఉపయోగిస్తామన్నారు. ఇందు కోసం బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న సంస్థలతో కలిసి పని చేస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu