టెక్నాలజీని వాడుకోవడం తెలియాలి కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. మీ దగ్గర అదనంగా ఒక ఫోన్ ఉంటే దానిని అత్యంత సులభంగా మౌస్‌గా.. లేదా వెబ్‌క్యామ్‌గా లేదా సెకండ్ డిస్‌ప్లేగా కూడా యూజ్ చెయ్యొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఉన్న అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే.. అవి లక్షలకొద్దీ అప్లికేషన్లకు సపోర్ట్ చేస్తాయి. ఈ అప్లికేషన్ల సహాయంతో మీ స్మార్ట్ ఫోన్ ఏదైనా చేయగలదు. మీ కంప్యూటర్ కు మౌస్‌గా మారగలదు. మీరు కావాలనుకుంటే అది వెబ్‌క్యామ్‌గా కూడా పని చేయగలదు. వైర్ కనెక్షన్ లేకుండా కూడా మీ ఫోన్‌ను మీ విండోస్ కంప్యూటర్ లేదా మ్యాక్ కంప్యూటర్లకు కనెక్ట్ చేయొచ్చు. ఇందుకు, కింద పేర్కొన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
* మీ ఫోన్‌ను మౌస్ లేదా కీబోర్డ్‌గా ఉపయోగించడానికి స్టెప్స్:
స్టెప్ 1: మీ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి రిమోట్‌మౌస్‌ను డౌన్‌లోడ్ చేయండి. అలాగే, మీ PC లో రిమోట్‌మౌస్ సర్వర్ ను https://www.remotemouse.net/ నుంచి డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 2: రిమోట్‌మౌస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 3: మీ మొబైల్ ఫోన్ లో రిమోట్‌మౌస్ యాప్‌ను లాంచ్ చేయండి. ఈ మొబైల్ యాప్ లో మీ PC కోసం స్కాన్ చేయండి. అప్పుడు మీ ఫోన్ స్క్రీన్‌లోని డివైజ్‌ల లిస్టులో మీ PC పేరు కనిపిస్తుంది. కనెక్ట్ చేయడానికి మీ PC పేరుపై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఇప్పుడు ఫోన్‌తో మీ PC కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీరు మీ ఫోన్‌ను టచ్‌ప్యాడ్‌గా, కీబోర్డ్‌గా ఉపయోగించవచ్చు. అలాగే మీ PC ని దూరం నుంచే షట్‌డౌన్ చేయడం, ఫంక్షన్ కీలను ఉపయోగించడం వంటి అనేక ఫీచర్‌లను ఉపయోగించవచ్చు.
* మీ ఫోన్‌ను సెకండ్ డిస్‌ప్లే/మానిటర్‌గా ఉపయోగించడానికి స్టెప్స్:
స్టెప్ 1: మీ PC, ఆండ్రాయిడ్ ఫోన్‌లో DuetDisplay ని డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 2: యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. తరువాత DuetDisplay యాప్ పని చేయాలంటే మీ PC ని రీస్టార్ట్ చేయాలి.
స్టెప్ 3: ఇప్పుడు మీ PC, Android డివైజ్‌లలో డ్యూయెట్ డిస్‌ప్లే యాప్‌ని లాంచ్ చేయండి. మీ విండోస్‌లో ఆండ్రాయిడ్‌ని సెలక్ట్ చేసుకోండి. వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి 'ఎయిర్' ట్యాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
* మీ ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడానికి స్టెప్స్:
స్టెప్ 1: ప్లే స్టోర్ నుంచి ఇరియున్ వెబ్‌క్యామ్(Iriun Webcam )ను డౌన్‌లోడ్ చేయండి. PC క్లయింట్‌ను Iriun Webcam అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 2: యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. వాటిని మీ ఫోన్, PC లలో లాంచ్ చేయండి.
స్టెప్ 3: PC లో యాప్ రన్ చేయడానికి మీ సిస్టమ్ యాప్ ట్రేలోని Iriun Webcam ఐకాన్‌పై డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు యాప్ మీ PC కి రెండవ కెమెరాగా పని చేస్తుంది.
0 Comments