మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన దీక్షా షిండే అనే 14 ఏళ్ల బాలిక నాసా ఫెలోషిప్‌కు ఎంపికైంది. నాసాలో ఆధ్వర్యంలో నిర్వహించే మైనారిటీ సర్వింగ్ ఇన్‌స్టిట్యూషన్ (ఎంఎస్ఐ) ఫెలోషిప్ వర్చువల్ ప్యానెల్‌లో ప్యానెలిస్ట్‌గా దీక్షా సెలెక్ట్ అయింది. 10వ తరగతి చదువుతున్న షిండే.. సెప్టెంబర్ 2020లో నాసా నిర్వహించిన Questioning the existence of God అనే ఎస్సే రైటింగ్ పోటీలో పాల్గొన్నది. అయితే.. అప్పుడు తను రిజెక్ట్ అయింది. స్టీఫెన్ హాకింగ్ బుక్స్ చదివి.. తను ఆ ఎస్సేను సబ్మిట్ చేసినప్పటికీ.. తనను నాసా రిజెక్ట్ చేసింది. అక్టోబర్ 2020లో దీక్షా.. మరోసారి ఎస్సేను రీసబ్మిట్ చేసింది. అయినప్పటికీ.. రెండోసారి కూడా తన ఎస్సేను నాసా రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ పట్టువీడని విక్రమార్కుడిలా.. దీక్ష.. బ్లాక్ హోల్ మీద రీసెర్చ్ చేసి మరీ.. ఎస్సే రాసి డిసెంబర్ 2020లో పంపించింది. అయితే.. బ్లాక్ హోల్ మీద దీక్ష పంపించిన ఆర్టికల్.. నాసాకు నచ్చింది. దీంతో International Astronomical Search Collaboration నిర్వహించే రీసెర్చ్ కాంపిటిషన్‌లో తను గెలిచింది. తను రాసిన ఆర్టికల్.. ‘We Live In Black Hole? కు International Journal of Scientific and Engineering Research ఓకే చెప్పేసింది. దీంతో తనను 2021 MSI Fellowships Virtual Panel of NASA ప్యానెలిస్ట్‌గా సెలెక్ట్ అయింది. నేను ఆ ఆఫర్‌కు ఓకే చెప్పా. దాని మీద వర్క్ కూడా చేస్తున్నా. రీసెర్చర్లు పంపించే ప్రపోజల్స్‌ను రివ్యూ చేయడమే నా జాబ్. రివ్యూ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్లస్, మైనస్‌లన్నీ నేను నాసాకు వివరించాలి. ఆ ప్రపోజల్ వల్ల.. రీసెర్చ్ విషయంలో ఎటువంటి సమస్యలు వస్తాయి.. స్టూడెంట్స్‌కు అకాడమిక్‌గా ఆ ప్రపోజల్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అనే కోణంలో నా రివ్యూ ఉంటుంది. పానెలిస్టుగా వర్క్ చేస్తున్నందుకు నాకు నాసా పే చేస్తుంది.. అని దీక్షా షిండే వెల్లడించింది. రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు షిండే.. నాసా కోసం ఆల్టర్నేట్ డేలో వర్క్ చేస్తుంది.
0 Comments