మోటరోలా తాజాగా మోటో జీ50 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆస్ట్రేలియన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. కొత్త మోటో జీ50 సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. దీని 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ AUD 399 (సుమారు రూ. 21,500) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. మోటో జీ50 5జీ మెటోరైట్ గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. లెనోవా ఆస్ట్రేలియా సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. మోటో జీ50 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. ఇది 6.5 -అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. హైబ్రిడ్ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ సహాయంతో దీని స్టోరేజ్‌ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే.. మోటో G50 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది. ఇక, దీని వెనుకవైపు LED ఫ్లాష్ కెమెరాను కూడా అందించింది. బ్యాక్ కెమెరా మోడ్‌లలో మాక్రో వీడియో, స్లో మోషన్ వీడియో, టైమ్‌లాప్స్, హైపర్‌లాప్స్, స్పాట్ కలర్ వంటివి అందించింది. దీని ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. ఇక, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 mAh బ్యాటరీని చేర్చింది. ఇది రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని పేర్కొంది. బాక్స్ లోపల 10W ఛార్జర్‌ను అందించింది. ఇక, దీని పవర్ బటన్ క్రింద సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్సీ, వైఫై ఏసీ, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, జీపీఎస్, 5జీ వంటివి అందించింది.
0 Comments