మార్కెట్‌లో 5జీ టెక్నాలజీ ఫోన్‌లు వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. వేగవంతమైన పనితీరుతోపాటు కొత్త ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మెడియాటెక్ న్యూ డైమెన్సిటీ 1200 చిప్‌తో నడిచే ఫోన్‌లను జనాలు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. వీటి ధర రూ.30,000 లోపే ఉండడం విశేషం.
షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ
- ధర: రూ. 27,499
- బేసిక్ ఫీచర్స్: 6జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
మెరుగైన ప్రాసెసింగ్ స్పీడ్ షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ మొబైల్ సొంతం. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీతో అందుబాటులో ఉంది. దీనితోపాటు 6జీబీ RAM, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ లభిస్తుంది. ఆకర్షణీయమైన రంగులతోపాటు 6.67 అంగుళాల సూపర్ ఏఎమ్‌ఓఎల్‌ఈడీతో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్టే ఫోన్ ప్రత్యేకత. అంతే కాకుండా హెచ్‌డీఆర్10+, 13,000 నిట్స్ లైటింగ్ ఉంటుంది. ఫోన్‌కి ఉండే 5 పొరల గొరిల్లా గ్లాస్ ఫోన్ పై గీతలు పడకుండా కాపాడుతుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేలో గేమ్స్ ఆడడం మంచి అనుభూతిని ఇస్తుంది. ఫోన్ మందం 8మిమీ కంటే తక్కువ ఉంది. కెమెరా 48 ఎంపీ దీనితో పాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్, 5 ఎంపీ అదనపు కెమెరాలు ఉన్నాయి. 20 ఎంపీతో ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రియులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బ్యాటరీ 4,520 ఎంఏహెచ్. గంటలో ఫోన్ మొత్తం చార్జ్ అయ్యేలా 33W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌తోపాటు వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 పై MIUI 12 తో రన్ అవుతుంది.
రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ
- ధర: రూ. 27,999
- బేసిక్ ఫీచర్స్: 12జీబీ RAM/ 256 జీబీ స్టోరేజీ
అందమైన ఫిన్షింగ్‌తోపాటు మెరుగైన ఫీచర్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది . రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 1200 SoC ని ఉపయోగించారు. 8 జీబీ RAM/ 128 జీబీ మెమోరీ స్టోరేజ్ మోడల్‌తో పాటు 12 జీబీRAM/256 జీబీ స్టోరేజ్ మోడల్‌లు ఉన్నాయి. 6.43 అంగుళాలతో ఫుల్ హెచ్‌డీ ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే 120 హెడ్జ్‌తో పాటు 1,000 నీట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ సెటప్ కెమెరా ఉంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా కెమెరా, 2 అదనపు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ వీడియోలు, ఫోటోలకు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంహెచ్ఏ, 50 W ఫాస్ట్ చార్జర్ ఫోన్‌తోపాటు వస్తాయి. ఫోన్ రియల్‌మీ UI 2.0 తో Android 11 ని ఉపయోగిస్తున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ 2
- ధర: రూ. 29,999
- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
కొత్త 5జీ మోడల్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2 ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. శక్తివంతమైన ప్రాసెసర్ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి. 6.43 అంగుళాల స్క్రీన్‌తోపాటు హెచ్‌డీ+తో పాటు ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఐదు పొరల గొరిల్లా గ్లాస్ ఫోన్‌కు అదనపు ఆకర్షణను ఇస్తుంది. 8 జీబీ RAMతో 128 జీబీ స్టోరేజ్ మెమోరీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కొత్త ఆక్సిజన్ ఓఎస్ 11.3 ని వినియోగిస్తున్నారు. 50 MP ప్రధాన కెమెరతో పాటు ఆప్టికల్ ఇమేజ్‌స్టెబిలైజేషన్ (OIS), సోనీ కొత్త IMX766 సెన్సార్ ఫీచర్ ఫోన్ సొంతం. విభిన్న లైటింగ్‌లలోనూ మంచి ఫోటోలు పొందేలా రూపొందించారు. ప్రధాన కెమెరాకు సపోర్టుగా 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2 MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 MP ఫ్రంట్ కెమెరా కారణంగా ఎక్కువ మంది సెల్ఫీ ప్రియులు ఈ ఫోన్‌పై మక్కువ చూపుతున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2 బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంహెచ్ఏ, అర్ధగంటలో చార్జ్ అయ్యేలా 65 W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌తో పాటు పొందవచ్చు.
పోకో ఎఫ్ 3 జీటీ
- ధర: రూ. 28,999
- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
పోకో ఎఫ్ 3 జీటీ డిజైనింగ్ఎక్కువగా గేమర్‌లను ఆకట్టుకొనేలా ఉంది. ఈ ఫోన్‌లో ఒక గ్లాస్ బ్యాక్, ఫిజికల్ గేమింగ్ ట్రిగ్గర్స్ (డెడికేటెడ్ గేమింగ్ బటన్స్) తో డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ 6.67 అంగుళాల సైజ్‌తోపాటు హెచ్‌డీ+ ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫోన్ వెనుకభాగానికి గొరిల్లా గ్లాస్‌తో రక్షణ కల్పించారు. 8 జీబీ RAMతో 128 జీబీ స్టోరేజ్ మెమోరీ కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,065 ఎంహెచ్ఏ బ్యాటరీ ఉంది. 67 W సోనిక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జర్ కేవలం 45 నిమిషాల్లో బ్యాటరీని మొత్తం చార్జ్ చేయగలదు. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీని పట్టించుకోలేదు. 64 MP ప్రైమరీ కెమెరా.. 8 MP అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 MP అదనపు కెమెరాను ఇచ్చారు. 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో MIUI 12.5 తో Android 11 ని ఉపయోగిస్తున్నారు.
ఒపో రెనో6 5 జి
- ధర: రూ. 29,990
- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌తో నడిచే ఒపో రెనో6 5జీ కూడా మిగతా మొబైల్స్ లాగా వినియోగదారులు ఇష్టపడే జాబితాలో ఉంది. ఫోన్‌తో 8జీబీ RAM మరియు 128 జీబీ స్టోరేజ్ లభిస్తాయి. ఈ ఫోన్ ఐఫోన్ 12. షేడ్స్ కలిగి ఉంది. 6.43-అంగుళాలు పరిమాణంలో ఏఎమ్‌ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ,90 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 750 నీట్స్ డిస్‌ప్లే సామర్థ్యం కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ ఫోన్ కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంహెచ్ఏ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. 65W సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌తో పాటు లభిస్తుంది. ఈ ఫోన్ పోకో ఎఫ్ 3 జీటీ, రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ మాదిరిగానే కెమెరా విభాగం ఉంది. 64 MP ప్రైమరీ కెమెరా.. 8 MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2 MP అదనపు కెమెరా లభిస్తుంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5G ఫోన్ కలర్‌ఓఎస్ 11.3 తో ఆండ్రాయిడ్ 11ని వినియోగిస్తున్నారు.
0 Comments