చిన్నగా, తేలిగ్గా ఉండే ఈ మాస్కు శక్తివంతమైన మోటార్‌తో ఇది పని చేస్తుంది. మాస్కు వినియోగించే వ్యక్తి శ్వాసను బట్టి ఎల్డీ డ్యుయల్ ఫ్యాన్లు ఎయిర్ ఫ్లోను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తాయి. దీనిద్వారా మాస్కు ధరించినా నేచురల్ గాలిని ఎంతో సౌకర్యవంతంగా తీసుకోవచ్చు. ప్యూరికేర్ మాస్కులు ఎయిర్ లీకేజీని చాలా వరకు తగ్గిస్తాయి. నోరు, చెంపలను పూర్తిగా కవర్ చేస్తూ టైట్‌గా ఉన్నా ఎక్కువ గంటలు వాడినా ఇబ్బంది అనిపించదు' అని ఎల్జీ ప్రకటించింది. ఎల్జీ తీసుకొచ్చిన ఈ ప్యూరీకేర్ మాస్కు 94 గ్రాముల బరువు ఉంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఈ మాస్కు 8 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అయితే మాస్కులో ఎలాంటి ఫిల్టర్లను ఉపయోగించింది ఎల్జీ స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే ఎప్పుడు లాంచ్ చేస్తామనేది కచ్చితంగా చెప్పకపోయినా.. ఆగస్టులో థాయ్‌లాండ్‌లో విడుదల చేయడం ఖాయంగా ఉంది.
ఆ తర్వాత ఆయా దేశాల ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్కులను ప్రవేశపెట్టనుంది. అలాగే టోక్యో ఒలింపిక్స్ పాల్గొంటున్న 120 మంది థాయ్‌లాండ్ అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఈ ప్యూరికేర్ మాస్కులను ధరించనున్నారని ఎల్జీ ప్రకటించింది. గతేడాది జూలైలోనే ఎయిర్ ప్యూరిఫయర్‌తో మాస్కును లాంచ్ చేసింది ఎల్జీ. మూడు స్పీడ్ మోడ్లతో రెండు ఫ్యాన్లతో దాన్ని తీసుకొచ్చింది. గాలి పీల్చుకునే సమయంలో ఆ ఫ్యాన్లు స్పీడ్‌గా.. గాలి వదిలే సమయంలో స్లోగా తిరిగి శ్వాసకు అనుకూలంగా ఉండేలా తయారు చేసింది. ఇప్పుడు ఏకంగా బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్లతో కొత్త తరహా మాస్కును ప్రవేశపెట్టింది
0 Comments