Ad Code

కార్తీక్‌ సెల్‌ఫోన్‌కు రాత్రి 11.30గంటలకు మిస్డ్‌కాల్‌ వచ్చింది

కార్తీక్‌ సెల్‌ఫోన్‌కు రాత్రి 11.30గంటలకు మిస్డ్‌కాల్‌ వచ్చింది. చూస్తే ఆ నెంబర్‌ ఎవరిదో తెలియదు. స్నేహితులు ఎవ్వరైనా ఇచ్చి ఉంటారనుకొని ఫోన్‌ చేశాడు. హలో..! ఎవరండి.... నాసెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చారని అనేలోపలే హారు..నాపేరు...అంటూ ఓ యువతి కంఠం తియ్యగా అవతలవైపునుంచి వినపడింది. మీరెవరండీ? అని ప్రశ్నించే లోపు ఒక్కనిమిషం! అంటూ కాల్‌ డైవర్ట్‌ అయింది. నిమిషాలు గడిచిపోతున్నాయి. అవతల వైపు నుంచి మ్యూజిక్‌ తప్ప మరేమీ సమాధానం రాకపోయే సరికి చిర్రెత్తి ఫోన్‌ కట్‌చేశాడు. వెంటనే సెల్‌స్క్రీన్‌పై బ్యాలెన్స్‌ రెండు రూపాయలు మాత్రమే ఉందని డిస్‌ప్లే అయింది. ఆశ్చర్యపోయాడు. తనసెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ మూడొందలు పైగా ఉంది. చేసింది లోకల్‌ నెంబర్‌కి. మహా అయితే, పదిహేను నిమిషాలకు ముప్ఫె రూపాయలు అవ్వాలి. కానీ ఏకంగా మూడొందల రూపాయలకు పైగా ఖర్చు అవ్వటంతో, వెంటనే కస్టమర్‌కేర్‌కు కాల్‌చేసి తనకు అయిన అనుభవాన్ని చెప్పాడు. వారు పరిశీలిస్తామని కంప్లెయింట్‌ తీసుకున్నారు. చేసేదేమీలేక ఉస్సూరుమన్నాడు. ఇది కూడా ఓ రకంగా తీవ్రవాదులు కస్టమర్‌ నెంబర్‌ను ట్రాప్‌ చేయటమేనని భద్రతా నిపుణులు అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu