Ad Code

పెరిగిన ఇంటర్నెట్‌ వాడకం..


దేశంలో ఇంటర్నెట్‌ వాడకం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా వృద్ధి చెందిందని టెలికామ్‌ గణాంకాలు వెల్లడిజేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్‌ చందాదారుల సంఖ్య 8.03శాతం మేరకు వృద్ధి చెందినట్లు తెలియజేసింది. గత సంవత్సరం ఈ సమయానికి 8.58 మిలియన్లుగా ఉన్నటువంటి వినియోగదారులు ప్రస్తుతం 9.27 మిలియన్లకు చేరారు. దీని ద్వారా ఇంటర్నెట్‌ వినియోగం దేశంలో విరివిగా పెరుగుతోందని వెల్లడైంది. కేవలం టెలిఫోన్‌ లైన్‌ ద్వారానే గాక, జిఎస్‌ఎమ్‌, సిడిఎమ్‌ఏల ద్వారా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేసేవారి సంఖ్య 31.30 మి
లియన్‌ల మంది ఉన్నారని వెల్లడైంది. ప్రస్తుతం 256కెబిపిఎస్‌ కంటే ఎక్కువ వేగంగా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేయటానికి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇప్పటికే ఈ విధంగా యాక్సెస్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడైంది.

Post a Comment

0 Comments

Close Menu