Ad Code

స్యామ్‌సంగ్‌ కొత్తగా 30దేశాలకు


ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ స్యామ్‌సంగ్‌ కొత్తగా 8.1ఎమ్‌పి (మెగాపిక్సల్‌) సామర్థ్యం ఉన్నటువంటి ఐ85 మోడల్‌ డిజిటల్‌ కెమెరాను భారత్‌లో ఆగస్టు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ఐ85 డిజిటల్‌ కెమెరా మూడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఎల్‌సిడితో పాటు, పిఎమ్‌పి (పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌) సైతం కలిగి ఆకర్షణీయమైన రూపంలో ఉంది. ఇందులో 30దేశాలకు చెందిన 2,600 ప్రాంతాలను టూర్‌ గైడ్‌గా పొందుపరిచారు. కెమెరా అంతర్గతంగా 450ఎమ్‌బి ఉంది. మెమరీని పెంచుకోవటానికి స్లాట్‌ ఉంది. ఇందులో మరో ప్రత్యేకత ఏమంటే..ఫోటోలు తీసేటప్పుడు షేక్‌ (చేతులు వణికినా) అయినా ఫోటో చక్కగా రావటానికి అడ్వాన్స్‌డ్‌ షేక్‌ రిడక్షన్‌ (ఏఎస్‌ఆర్‌) సిస్టమ్‌ను, ఐఎస్‌ఓ 1600 హై సెన్సిటివీ సపోర్ట్‌ను స్యామ్‌సంగ్‌ పొందుపరిచింది. అంతేగాక ఈ కెమెరా తనంతట తానే ఎదుటివారి ముఖాన్ని గుర్తించే (ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ) ఇంటలిజెన్స్‌ కల్గి ఉంది. దీని ధర రూ.9,000వరకు ఉండొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu