Ad Code

మోటో జి మాక్స్ స్మార్ట్ ఫోన్ విడుదల

దేశీయ మార్కెట్లో మోటోరోలా కొత్త 5జి ఫోన్ మోటో జి మాక్స్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. మొబైల్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ప్రైస్ భారీగా పెరిగిన సంగతి విదితమే. అయితే, ఈ ఫోన్ ను ప్రైస్ కి తగిన విలువనిచ్చే స్పెక్స్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది.  మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 6GB + 128GB సింగిల్ వేరియంట్ లో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 27,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పాంటోన్ స్టార్ గేజర్, పాంటోన్ అలాస్కన్ బ్లూ మరియు పాంటోన్ మలాగా అనే మూడు అందమైన రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ పై రెండు లాంచ్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, రూ. 1,000 రూపాయల Axis అండ్ ICICI బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ మరియు రెండోది రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 26,999 ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.72 అంగుళాల LCD స్క్రీన్ తో అందించింది. అయితే ఈ స్క్రీన్ FHD + రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1050 HBM బ్రైట్నెస్ తో ఉంటుంది. అందుకే, ఇందులో వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ శాటిన్ ఇన్స్పైర్డ్ ఫినిష్ తో చాలా ప్రీమియం గా ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో అందించిన 6GB LPDDR 5X ర్యామ్, 12GB ర్యామ్ బూస్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ MIL-STD 810H ఫీచర్ మంచి డ్యూరబిలిటీ కూడా కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది మరియు 2 OS అప్డేట్ మరియు 3 సంవత్సరాల అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ లో 50MP Sony LYTIA 600 మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MO సెల్ఫీ కెమెరా ఉంటాయి. అయితే, ఈ ఫోన్ కేవలం 2K వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు మోటోరోలా యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu