ఢిల్లీలో సెప్టెంబర్‌లో జరిగే బిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారీ బృందంతో భారత్‌కు వస్తున్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. డోక్లాం ఘర్షణ తర్వాత, దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రాబోతున్నారు. దీంతో బ్రిక్స్ సమావేశాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. జిన్‌పింగ్ వచ్చే నెలలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటన ముఖ్యమైనదని.. భారత్-చైనా మధ్య మెరుగుపడుతున్న సంబంధాలకు సంకేతమని రాయిటర్స్ పేర్కొంది. జిన్‌పింగ్ హాజరు ఎంత ముఖ్యమైనదంటే బ్రిక్స్ సదస్సు కంటే ఆయన గురించే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాలు ఇటీవల కొన్ని చర్చలు జరిపాయి. ఈ సమయంలో అజిత్ దోవల్ కూడా చైనాలోనే ఉన్నారు. పలు ముఖ్యమైన చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
0 Comments