Ad Code

థాయ్‌లాండ్‌ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఓ ఉపాధ్యాయుడు సహా ఇద్దరు మృతి : తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

థాయ్‌లాండ్‌లో ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఓ ఉపాధ్యాయుడు సహా ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం బ్యాంకాక్‌కు ఉత్తరంగా ఉన్న నోంతబురి ప్రాంతంలోని ఓ పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి అదే పాఠశాలకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. 

Post a Comment

0 Comments

Close Menu