ఇండియాలో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి కంటే ఏఐ కోసమే కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని నోమురా హోల్డింగ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఈ ఒక్క విషయం ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్రస్తుతం టెక్ ఉద్యోగుల మధ్య ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ప్రపంచ దేశాలకు భారత్ ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఏఐ వల్ల కేవలం ఉద్యోగాలు పోతాయనే అపోహ ఉన్న తరుణంలో, కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టించవచ్చో, జాబ్ మార్కెట్‌లో సమతుల్యతను ఎలా సాధించవచ్చో చెప్పడానికి ఇండియా ఒక ‘రియల్-వరల్డ్ టెస్ట్ కేస్’గా మారింది. ప్రపంచ దేశాలకు ‘బ్యాక్ ఆఫీస్’గా పేరుగాంచిన ఇండియాలో ఎన్నో రకాల, ఎన్నో రంగాలకు చెందిన ఐటీ సేవలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీ వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండాలి.
0 Comments