Ad Code

కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి !

తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని ,మల్కపేట గ్రామంలో కొడుకు పై తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన గుడిపేట రాఘవులు అనే వ్యక్తి తన కొడుకు రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేందర్ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉండగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలు, కుటుంబ కలహాలేనా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu