Ad Code

పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన కారు : తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా: పెద్దూరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లోకి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోని ఇంధన నింపే యంత్రాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పెట్రోల్ బంక్‌కు చెందిన యంత్రం కూడా ధ్వంసమైంది. ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పెట్రోల్ బంక్‌లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

Post a Comment

0 Comments

Close Menu