Ad Code

జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా అభా నాయర్‌

జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఢిల్లీలో పుట్టి పెరిగిన అభా నాయర్‌ చరిత్ర సృష్టించారు. అభాకు ఏడేళ్ల వయసులో ఆమె కుటుంబం ఉపాధి కోసం 1973లో జాంబియాకు వెళ్లింది.అంతేకాదు భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు ధర్మాసనం పై ఆసీనులైన తొలి జాంబియా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలిచారు. ఆమె భారతదేశ పర్యటలో భాగంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) నిర్వహించిన "న్యాయం అందించే భవిష్యత్తు: ఆవిష్కరణ, సమ్మిళితం మరియు సమగ్రత" అనే అంశంపై జస్టిస్ పటేల్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహన కూడా ప్రసంగించారు. జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు జస్టిస్‌ అభా నాయర్‌ భారత సుప్రీంకోర్టు న్యాయపీఠాన్ని అలంకరించడం విశేషంగా నిలిచింది.

Post a Comment

0 Comments

Close Menu