సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బంగారు ఆభరణాల తయారీ కర్మాగారంలో ఓ కార్మికులపై మరో కార్మికుడు దాడి చేశాడు. తలపై పదునైన పరికరంతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది.. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సిరిసిల్ల కు చెందిన శ్రీనివాస్ చారి జనరల్ బజార్ లోని బంగారం ఆభరణాల తయారీ వర్క్ షాప్ లో పని చేస్తున్నాడు. తనకు రావలసిన డబ్బులపై యజమాని రాజును నిలదీశారు.. ఇద్దరి మధ్య మాట పెరిగింది.. షాపు యజమాని రాజు దాడి చేయడంతో శ్రీనివాసచారి గాయాల పాలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments