Ad Code

ఢిల్లీ ఐఐటీ 57వ దీక్షాంత సమారోహంలో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 57వ దీక్షాంత సమారోహంలో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మోడీ  3,000 మందికి పైగా పట్టభద్రులు కానున్న విద్యార్థులను పలుకరించారు. వీరిలో 587 మంది Ph.D. పరిశోధకులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం  అధికారిక ప్రకటన ప్రకారం, మోడీ  అకడమిక్ ఎక్సలెన్స్‌ను గుర్తిస్తూ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, డైరెక్టర్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ టెన్ గోల్డ్ మెడల్స్ వంటి సంస్థ అత్యున్నత గౌరవాలను మెరిటోరియస్ విద్యార్థులకు ప్రదానం చేశారు. దేశ యువతను చూస్తే గర్వంగా ఉంది అన్నారు. భవిష్యత్ భారత నిర్మాతలు మీరే అని వారిని మెచ్చుకున్నారు.  

Post a Comment

0 Comments

Close Menu