Ad Code

$567 మిలియన్ చెల్లించాలని మెటాను ఆదేశించిన న్యూ మెక్సికో కోర్టు

యువత, పిల్లలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కలిగిన నష్టాలను పరిష్కరించేందుకు $567 మిలియన్ చెల్లించాలని  మెటాను న్యూ మెక్సికో కోర్టు ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు సంబంధించిన అంశాలపై జరిగిన కీలక విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. గురువారం వెలువడిన తీర్పులో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ మొత్తం $567 మిలియన్లలో $420 మిలియన్లను యువతకు చికిత్సా సేవల కోసం కేటాయించాలని ఆదేశించారు. మిగిలిన మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో అవగాహన, నివారణ కార్యక్రమాలు, స్క్రీనింగ్ సేవలు, ఇతర సంబంధిత ఖర్చుల కోసం వినియోగించనున్నారు. ఈ కేసులో మొదటి దశ విచారణ మార్చిలో జరిగింది. అప్పట్లో జ్యూరీ  మెటాను $375 మిలియన్ల సివిల్ పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లు పనిచేస్తున్నాయని తెలిసినా Meta దానిని కొనసాగించిందని, అలాగే తన ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిందని జ్యూరీ అభిప్రాయపడింది. రెండో దశ విచారణలో ప్రాసిక్యూటర్లు  మెటా కార్యకలాపాల్లో మరిన్ని మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులను ఎక్కువసేపు ఉంచే వ్యసనపూరిత ఫీచర్లను నియంత్రించడం, వయస్సు ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పిల్లల కోసం డిఫాల్ట్ ప్రైవసీ రక్షణలను పెంచడం వంటి చర్యలను కోరారు. అయితే, 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొన్ని వయస్సు ధృవీకరణ పద్ధతులను అమలు చేయడంపై ఫెడరల్ చైల్డ్ ప్రైవసీ చట్టాలు పరిమితులు విధిస్తున్నాయని కోర్టు పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu