Ad Code

నిర్మల్‌లో ఏసీబీకి చిక్కిన పన్నుల శాఖాధికారులు : రూ.50వేలు లంచం తీసుకుంతుండగా పట్టివేత

తెలంగాణ లోని నిర్మల్‌ జిల్లా కేంద్రంలో సోమవారం పన్నుల శాఖ నిర్మల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఫిర్యాదుదారుడు నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్ జిల్లాల ఎస్‌టీవో కొప్పెల గోదావరి, సీనియర్‌ అసిస్టెంట్‌ మంత్రి సాయికృష్ణను ఆదిలాబాద్‌ రేంజ్‌ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధిన ఆడిట్‌ లెక్కల వ్యవహరంలో అనుకూలంగా నివేదికను తయారు చేయాలని మంచిర్యాల పట్టణానికి చెందిన జువెల్లరి దుకాణపు యజమాని లక్కింశెట్టి వీర భాస్కర రావు ఎస్టీవో అధికారులను సంప్రదించాడు. దీంతో ఇద్దరు అధికారులు మొదట లక్ష రూపాయలు డిమాండ్‌ చేసి చివరకు రూ. 50వేలకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు వ్యూహం ప్రకారం సోమవారం ఇద్దరు అధికారులను పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ ఇద్దరిని కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu