తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు గుప్పించారు. హరీశ్‌రావు కాదు ఆయన అబద్దాల రావు అని ఎద్దేవా చేశారు. 22ఏ లో ఆయన కొండను తవ్వి ఎలుకను పట్టారని, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని సెటైర్లు గుప్పించారు. గతంలో సాఫ్ట్ కాపీ అప్‌లోడ్ చేయకపోవడం వల్ల తప్పు జరిగిందని తామే గుర్తించామని అన్నారు. ఆయన ఎత్తు పెరగడం కాదని, విమర్శలు చేసే ముందు బుర్ర కూడా ఉపయోగించాలని మంత్రి వ్యగ్యంగా మాట్లాడారు. ఎవరికీ అన్యాయం జరగనియ్యమని అన్నారు. ప్రభుత్వ భూములు కాకపోతే కచ్చితంగా వాటిని 22ఏ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో మాదిరిగా తాము బుకాయించడం లేదని చెప్పారు. కేంద్రం, ఎన్నికల సంఘం, బీఆర్ఎస్ కలిసి ఓట్లను తొలగించే కుట్రను చేస్తున్నాయని.. వారి పప్పులు ఉడకనివ్వబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
0 Comments