Ad Code

జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు : నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

మ్మూకాశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు ఈరోజు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతుల్లో భారీ వర్షాల కారణంగా పూంచ్ జిల్లాలో ఇల్లు కూలి ముగ్గురు మరణించగా.. రాజౌరిలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గల్లంతైన ఐదుగురి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu