Ad Code

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యానికి పాల్పడిన దుండగుడు : అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

డిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో రోజూలాగే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల పసిపాపపై చమక పాలెయ అనే స్థానిక వ్యక్తి కన్నువేశాడు. ఆ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి, మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ పసిపాప ఎలాగోలా ఇంటికి చేరుకుని, జరిగిందంతా తన తల్లికి ఏడుస్తూ చెప్పడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పాప చెప్పిన వివరాలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు, ఊరి పెద్దలను ఆశ్రయించారు. ఊరి పెద్దలు పంచాయితీ నిర్వహించగా అక్కడికి వచ్చిన నిందితుడు తాను చేసిన తప్పును అంగీకరించాడు. అయితే, గ్రామ పెద్దలు ఈ విషయాన్ని అక్కడక్కడే రాజీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, బాధితురాలి తల్లి దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. నేరుగా బిషోయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ధైర్యంతో స్పందించి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu