Ad Code

తెలంగాణ అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయం

తెలంగాణ శాసనసభలో మీడియా అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి సోమవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మీడియా అడ్వైజరీ కమిటీ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో చైర్మన్ పరిపూర్ణ చారి, సభ్యులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీ అడ్వైజరీ కమిటీ కోసం దేశంలో ఏ అసెంబ్లీలోనూ ప్రత్యేక కార్యాలయం లేదు. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి వసతి ఏర్పాటు జరగలేదు. కాని మొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడ్వైజరీ కమిటీ కోసం ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యాలయ ఏర్పాటు జరిగింది.

Post a Comment

0 Comments

Close Menu