Ad Code

రోడ్డు పక్కన సంచిలో నవజాత శిశువు : అమీర్‌పేట్‌ శిశువిహార్‌కు అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌లో కళ్లు తెరిచి ఇరవైనాలుగు గంటలు కూడా గడవకముందే ఓ శిశువు అనాథగా మారింది. రోడ్డు పక్కనే ఓ సంచిలో శిశువు కనిపించడంతో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానికులు డయల్‌ 100 సమాచారం అందించారు. ఆర్‌జీఐఏ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును శంషాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం అమీర్‌పేట్‌లో శిశువిహార్‌కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంజీవులు తెలిపారు. శిశువు వివరాలు తెలిసిన వారు ఆర్‌జీఐఏ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu