అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వివాదం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. దానిలో రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్‌నకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర , సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం వెండి వంటి అన్నిరకాల కానుకల నిర్వహణ కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్, ఖర్గే పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటు ట్రస్టుకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో తెలుసుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందని, అందువల్ల పారదర్శకత చాలా అవసరమని రాహుల్ గాంధీ, ఖర్గే పేర్కొన్నారు.
0 Comments