Ad Code

పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత : ప్రధాని మోడీ నివాళులు

త్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని తీజన్ బాయి (70) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆమె రాయ్‌పూర్‌లో మరణించారు. ఆమె మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన తీజన్ బాయి ఛత్తీస్‌గఢ్ సాంప్రదాయ కళను ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో తీజన్ బాయి జన్మించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకువెళ్లినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఇండియాలోని అత్యంత ప్రసిద్ధ జానపద కళాకారిణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu