మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 4800 మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఇది మొత్తం కంపెనీ వర్క్ ఫోర్స్‌లో 2.1 శాతం. ఏఐ మౌలిక సదుపాయాలపై బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్న నేపథ్యంలో, ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ ఏడాది ఏఐ రంగంలో అన్ని టెక్ కంపెనీలు కలిపి ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు అమెజాన్, మెటా, గూగుల్ వంటి సంస్థలు కూడా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫలితంగా తమ ఉద్యోగులకు తొలగిస్తున్నాయి. 2026 మొదటి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 23 శాతం పడిపోయిన నేపథ్యంలో, సోమవారం నాడు ఈ కోతలను ప్రకటించింది. 2022 తర్వాత ఇదే అత్యంత దారుణమైన ఫస్ట్ హాఫ్ పనితీరు. మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన యూఎస్ ఉద్యోగులకు సుమారు 7 శాతం మందికి, అంటే దాదాపుగా 9000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఉద్యోగాల కోతను ప్రకటించింది
0 Comments