Ad Code

తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును జూలై 17న ప్రారంభించనున్న ప్రధాని

దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 17న ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఈ రైలు నడవనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీజిల్ మల్టిపుల్ యూనిట్ (డీఎంయూ) రైలు ఈ ప్రయాణానికి రెండు గంటల సమయం తీసుకోగా, ఈ సరికొత్త హైడ్రోజన్ రైలు కేవలం ఒక్క గంటలోనే గమ్యస్థానానికి చేరుస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా', హరిత రవాణా మిషన్‌లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో రూ. 89 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపకల్పన చేశారు. ఈ రైలులో 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అమర్చారు. హైడ్రోజన్, ఆక్సిజన్ల రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఈ రైలును నడుపుతారు. దీనివల్ల పొగకు బదులు కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతుంది. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే దాదాపు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu