జూలై చివరలో జరిగే శాంసంగ్ 'అన్‌ప్యాక్డ్' ఈవెంట్ లో ఫ్లాగ్‌షిప్ మోడల్స్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్లను ప్రీ-రిజర్వ్ చేసుకోవాలంటే కేవలం రెండు వేల రూపాయల టోకెన్ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల సేల్ మొదలైనప్పుడు ప్రయారిటీ డెలివరీతో పాటు ఎక్స్‌క్లూజివ్ ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. జూలై చివరలో భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 8 ధర ప్రీమియం ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లోనే ఉండనుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1,50,000 ఉండొచ్చని అంచనా. ఇక ఫ్లిప్ 8 ధర రూ. 90 వేల నుంచి లక్ష రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, మరింత పటిష్టమైన హింజ్ వంటి ఫీచర్ల కారణంగా ఈ ధరలు ఉండనున్నాయి.
0 Comments