Ad Code

హార్దిక్ పాండ్యాకు మరో గాయం : వన్డే సిరీస్‌కు దూరం!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొడ కండరాల గాయంతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయానికి గురయ్యాడని, కోలుకోవడానికి 3 వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో బాధపపడ్డాడు. దాంతో అతను 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్‌ పూర్తి చేసుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్ట్‌ను కూడా క్లియర్ చేశాడు. అయితే 10 ఓవర్లు ఫుల్ కోటా అసైన్‌మెంట్ పూర్తి చేసే క్రమంలో హార్దిక్ పాండ్యాకు గాయమైనట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu